హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కొలువుదీరనున్న గోసంరక్షణ సమితి పాలకవర్గం

ఏలూరు గోసంరక్షణ సమితికి నూతన పాలకవర్గం ఏర్పాటు కానుంది. రేపు 21 మంది సభ్యులతో నూతన పాలకవర్గం కొలువుదీరనుంది. ఈ విషయాన్ని సమితి ప్రస్తుత అధ్యక్షుడు దివ్వెల జయబాబు వెల్లడించారు. పాలకవర్గం ఏర్పాటుకు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కమిటీ బాధ్యతలు చేపట్టడంతో సమితి కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.