ASR: జీకే వీధి మండలం వంచుల సెరపల్లి గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న తమ్ముడు తన అన్న తలపై కర్రతో బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తులోనే ఈ దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న జీకే వీధి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు


