హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్యపై దాడి భర్తకు 15 రోజుల రిమాండ్!

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని బండివారిపాలెంలో భార్య నాగేంద్రపై అనుమానంతో కత్తితో దాడి చేసిన భర్త పూండ్ల యేసురత్నాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 18న జరిగిన ఘటనపై బాధితురాలి వాంగ్మూలం మేరకు ఎస్సై ఆవుల బాలకృష్ణ కేసు నమోదు చేశారు. నిందితుడిని అద్దంకి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఎస్సై తెలిపారు.