హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిహారం చెల్లింపునకు అవార్డులు జారీ

VZM: చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో 22 కేసులు రాజీ అయ్యాయి. విజయనగరం, పార్వతీపురం ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయనగరం 13, పార్వతీపురం 5, బొబ్బిలి 3, గజపతినగరం ఒక కేసు పరిష్కారమయ్యాయి. బాధితులకు మొత్తం రూ.71,67,857 పరిహారం చెల్లించేలా అవార్డులు జారీ చేసినట్లు జిల్లా జడ్జి బబిత తెలిపారు.