హైదరాబాద్: 28°C
తెలంగాణ

బయటపడ్డ కాకతీయుల అపురూప శిల్పాలు

NLG: అప్పాజీపేట గ్రామంలో కాకతీయుల కాలం నాటి ద్వికూట శివాలయ పునర్నిర్మాణ పనుల్లో శనివారం అపురూపమైన శిల్పాలు వెలుగుచూశాయి. ఆలయం చుట్టూ శిథిలాలను తొలగిస్తుండగా గజారోహక వీరగల్లు, కేశవమూర్తి విగ్రహం, మూడు నాగశిలలు, మధ్యయుగాల నాటి ఇటుకలు బయటపడ్డాయి. వీటిని గ్రామస్తులు జాగ్రత్తగా బాలాలయం వద్ద భద్రపరిచారు.