కోనసీమ: శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ, పూడికతీత పనులను వేగవంతం చేసి రానున్న వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం అమలాపురంలో JCతో కలిసి అధికారులతో సమీక్షించారు. డ్రెయిన్ పరిధిలోని ఆక్రమణల తొలగింపునకు గ్రామాల వారీగా సర్వే వివరాలు మార్కింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'పూడికతీత పనులను వేగవంతం చేయాలి'


