అన్నమయ్య: నందలూరు మండలం పాటూరు గ్రామ సర్పంచ్‌గా పెమ్మనబోయిన ఎల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన ఎన్నికకు సహకరించిన వార్డు సభ్యులు, గ్రామ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణం, వీధిలైట్ల ఏర్పాటు తదితర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాటూరు సర్పంచ్‌గా ఎల్లయ్య ఏకగ్రీవం


