హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మూడో విడత ఎన్నికలు.. 1,585 నామినేషన్లు'

KDP: మూడో విడత ఎన్నికలు జరగనున్న 13 మండలాల్లో శనివారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 465, వార్డు సభ్యులకు 1,120 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. 22, 23 తేదీల్లోనూ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని, కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.