WGL: నెక్కొండ మండలంలోని చంద్రుగొండ గ్రామానికి చెందిన ముడిదేని మమత (35) విద్యుదాఘాతంతో శనివారం మృతి చెందింది. పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆమె వేడినీళ్ల కోసం హీటర్ స్విచ్ వేయగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మమత మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
తెలంగాణ
కరెంట్ షాక్‌తో మహిళ మృతి!


