హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలానికి రాత్రివేళల్లో ఇసుక తరలింపు

BDK: ఎటపాక పరిసరాల నుంచి భద్రాచలానికి రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక లారీల్లో తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో లారీ ఇసుకను రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక దొరకని పరిస్థితిలో అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.