VSP: విధులకు వెళ్లిన యువకుడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేపగుంటకు చెందిన గుండు నవీన్‌కుమార్ (26) విశాఖ డెయిరీలో వ్యాన్ డ్రైవర్. ఈ నెల 20న విధులకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు


