పల్నాడు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల తొలిరోజు 496 మంది నామినేషన్లు వేశారు. సర్పంచ్ స్థానాలకు 103, వార్డు సభ్యుల స్థానాలకు 393 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 189 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనుండగా, 12 మండలాల పరిధిలో నామినేషన్ల స్వీకరణ జరిగింది. మాచవరంలో అత్యధికంగా సర్పంచ్‌కు 15, వార్డులకు 80 నామినేషన్లు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
తొలి రోజు 496 నామినేషన్లు నమోదు


