హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు మార్కెట్‌లో పంటల ధరలు ఇలా!

కర్నూలు ఈ-నామ్ వ్యవసాయ మార్కెట్‌లో శనివారం వివిధ పంటలకు ధరలు నమోదయ్యాయి. క్వింటాల్ వేరుశనగకు రూ.9,560, ఎండు మిర్చికి రూ.24,021, ఉల్లిగడ్డలకు రూ.4,219, మినుములకు రూ.8,929, ఆముదాలకు రూ.7,689 గరిష్ఠ ధర లభించింది. కర్రలకు రూ.4,612, శనగలకు రూ.7,160 ధర పలకగా, రైతులు మార్కెట్ ధరలను గమనించి విక్రయాలు చేపట్టాలని అధికారులు సూచించారు.