KRNL: ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు సంబంధించిన పెండింగ్ భూసేకరణను రెండు మూడు వారాల్లో పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో డీఆర్వో, ఆర్డీవో, ఏపీఐఐసీ అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకాలు లేకుండా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఓర్వకల్లు హబ్ భూసేకరణకు గడువు: కలెక్టర్


