హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు కిందపడి వ్యక్తి మృతి

NLR: బిట్రగుంట రైల్వే స్టేషన్‌కు ఉత్తరం వైపున రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. వ్యక్తి రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. రైల్వే జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు అయ్యప్ప మాల ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించాలన్నారు.