SS: పుట్టపర్తిలోని సాయికుల్వంత్ సభా మందిరంలో నవంబర్ 21న 10వ అఖిల భారత సేవాదళ్ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, నేపథ్య గాయకుడు కళైమామణి మనో తన ఆర్కెస్ట్రాతో 'భక్తి వైభవం' సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేశుడు, శివుడు, నటరాజ స్వామి, భగవాన్ శ్రీ సత్యసాయిని కీర్తిస్తూ ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో గాయకుడు మనో సంగీత విభావరి


