హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెడనలో తొలి రోజు భారీగా నామినేషన్లు

కృష్ణా: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా శనివారం పెడన నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 80 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 232 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బంటుమిల్లిలో సర్పంచ్ 15, వార్డు సభ్యులు 38, పెడనలో 32, 76, గూడూరులో 16, 63, కృత్తివెన్నులో 17, 55 నామినేషన్లు వచ్చాయి.