హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సముద్ర స్నానాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

కృష్ణా: కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు మంగినపూడి బీచ్‌కు సుమారు 1.50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్, పార్కింగ్, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచాలని వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు.