TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారులు రూ.1.37 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి మస్కట్ మీదుగా వచ్చిన ప్రయాణికుడి ట్రాలీ బ్యాగులో 1,051 గ్రాముల 9 బంగారు బిస్కెట్లను గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రయాణికుడితో పాటు బయట వేచి ఉన్న రిసీవర్‌ను అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
వార్తలు
ఎయిర్‌పోర్టులో కిలోకు పైగా బంగారం సీజ్


