TG: సీఎం రేవంత్ రెడ్డి తీరు వల్లే ఏపీ మరోసారి జలదోపిడీకి తెరలేపిందని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రజాభవన్‌కు చంద్రబాబును పిలిచి, గురుదక్షిణగా మన నీళ్లను అప్పగించారని ఆరోపించారు. సాగర్‌పై ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్‌ను వారం రోజుల్లో ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే వేలాది మందితో సాగర్ డ్యామ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు.
వార్తలు
రేవంత్ తీరు వల్లే ఏపీ జలదోపిడీ: కవిత


