హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ-ప్రిస్క్రిప్షన్‌ విధానాన్ని పాటించండి: నడ్డా

యువ వైద్యులు ఈ-ప్రిస్క్రిప్షన్‌ విధానాన్ని పాటించి డిజిటల్‌ మిషన్‌లో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. పుదుచ్చేరి జిప్మర్ 15వ స్నాతకోత్సవంలో 816 మందికి పట్టాలు ప్రదానం చేశారు. వైద్య విద్య సమాజం ఇచ్చే వరమని, ప్రజలకు సేవ చేసే బాధ్యత డాక్టర్లపై ఉందన్నారు. కొత్తగా 10 వేల మెడికల్ సీట్ల కోసం రూ.15 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.