హైదరాబాద్: 28°C
వార్తలు

గుంటూరు యువతికి రూ.46 లక్షల ఉద్యోగం

గుంటూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని అమెజాన్‌లో డేటా ఇంజినీర్ ఇంటర్న్‌గా ఎంపికై ఏడాదికి రూ.46 లక్షల ప్యాకేజీ సాధించింది. రోజువారీ కూలీ రాంబాబు, టైలర్ లక్ష్మీ సుజాత దంపతుల కుమార్తె అయిన వరలక్ష్మి వీవీఐటీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ చదివింది. అదే కళాశాలకు చెందిన కుసుమ కూడా ఇదే ప్యాకేజీతో ఎంపికవడం విశేషం. దీంతో కళాశాల ఛైర్మన్ విద్యాసాగర్ వారిని అభినందించారు.