SDPT: గజ్వేల్ పట్టణంలోని శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయంలో తులసి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు నిరంజన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు జగ్గయ్యగారి శ్రీనివాస్, సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
వార్తలు
ఆలయంలో వైభవంగా తులసి కళ్యాణం


