హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్

JN: జనగామ జిల్లా కోర్టులో ఎన్‌ఐ యాక్ట్ కేసుల పరిష్కారం కోసం శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ మాట్లాడారు. ఇరు పక్షాలు పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవించాలని సూచించారు. కక్షిదారుల సౌకర్యార్థం నాలుగు ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేశారు.