హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుండీ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

SRCL: ఎల్లారెడ్డిపేట గొల్లపల్లి ఆలయ హుండీ చోరీ కేసులో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. వేణుగోపాల స్వామి ఆలయంలో హుండీ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు అందడంతో సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఆధారాలతో ముద్ర కోళ నరసింహులును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు. ఆలయాల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.