NTR: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో తిరువూరు RDO ఏ.కుమార్ తిరువూరు మండలంలోని లక్ష్మీపురం, చింతలపాడు, గంపలగూడెం మండలంలోని గంపలగూడెం, వినగడప గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ తీరును తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
వార్తలు
నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో


