హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అధికారుల అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలి'

MBNR: జడ్చర్లలో అధికారుల అవినీతిపై ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జ్ పండరీనాథ్ రాథోడ్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల బిల్లుల కోసం 10 -20 శాతం కమిషన్లు, రూ.15 వేల లంచం అడిగినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.