హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యేక లోక్ అదాలత్లో 43 కేసుల పరిష్కారం

HNK: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతమైంది. జిల్లా కోర్టు, నర్సంపేట కోర్టులో చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ఆరు బెంచీలు ఏర్పాటు చేశారు. మొత్తం 43 కేసులను పరిష్కరించి రూ.1,81,61,563 విలువైన వివాదాలకు ముగింపు పలికినట్లు సంస్థ ఛైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ తెలిపారు.