హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే స్టేషన్లలో పోలీసుల తనిఖీలు

మహబూబాబాద్, కేసముద్రం రైల్వే స్టేషన్లలో శనివారం పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు, అనుమానితుల కదలికలను పరిశీలిస్తూ వేలిముద్రల ద్వారా వివరాలు సేకరించారు. వదిలేసిన వాహనాలు, దుకాణాల వద్ద కూడా ఆరా తీశారు. నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ కొనసాగుతుందని ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.