హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ఊరట కల్పించిన మంత్రి

KMM: రైతుల విజ్ఞప్తితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల విడుదలకు ఆదేశించారు. దీంతో వైరా–ఏన్కూరు, అన్నపురెడ్డిపల్లి, రామచంద్రపురం మేజర్ కాలువలకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఆదివారం నాటికి కాలువలకు సాగునీరు చేరనుంది. పంటలకు చివరి తడి అందించి దిగుబడులను కాపాడాలని మంత్రి సూచించారు.