ADB: గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 24న ప్రభుత్వ సెలవు ఉన్నందున ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి తెలిపారు. మంగళవారం రైతులు పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని సూచించారు. ఈ నెల 25న యథావిధిగా పత్తి కొనుగోళ్లు జరుగుతాయని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 24న పత్తి కొనుగోలు బంద్


