హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ బహుమతి సందేశాలు నమ్మవద్దు: SI

కొత్తగూడెం కార్పొరేషన్ 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్‌లోని ఓ స్కూల్‌లో శనివారం అవగాహన సదస్సు జరిగింది. 2 టౌన్ SI రాజశేఖర్ విద్యార్థులకు ఆత్మరక్షణ, నైతిక విలువలు వివరించారు. ఏరోజు పాఠం ఆరోజే చదవాలని, మొబైల్ గేమ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అపరిచితులకు వ్యక్తిగత ఫొటోలు పంపవద్దని, నకిలీ బహుమతి సందేశాలను నమ్మవద్దని, ఓటీపీ చెప్పవద్దని హెచ్చరించారు.