హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పథకాలను పరిశీలించాలి: కలెక్టర్

NZB: శిక్షణలో భాగంగా జిల్లాకు చేరుకున్న 14 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22 నుంచి 28 వరకు ఆర్మూర్ డివిజన్‌లోని అంకాపూర్, బోధన్ డివిజన్‌లోని భూలక్ష్మీ  క్యాంప్ గ్రామాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భూభారతి అమలు, ప్రజల జీవన స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.