హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ఒలింపియాడ్ పోటీలు

BHPL: చిట్యాల జెడ్పీహెచ్‌ఎస్‌లో మండల స్థాయి ఇంగ్లిష్ ఒలింపియాడ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. సీఐ సతీశ్, ఎంఈఓ రఘుపతి, ప్రిన్సిపల్ శ్రీదేవి కలిసి పోటీలను ప్రారంభించారు. అంతర్జాతీయ పోటీ ప్రపంచంలో ఆంగ్ల పరిజ్ఞానం కీలకమని వారు సూచించారు. పలు పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటగా, విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.