హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SRCL: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన మన్నే జలజ - రక్షన్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.