MNCL: మందమర్రి బస్టాండ్ నుండి మార్కెట్ వైపు వెళ్లే దారిలో డివైడర్ పనులు వెంటనే పూర్తి చేయాలని BSP జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మున్సిపాలిటీ కమిషనర్ తుంగపిండి రాజలింగుని కలిసి వినతిపత్రం అందజేశారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి వెంటనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
డివైడర్ పనులు వెంటనే పూర్తి చేయాలని వినతి


