MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి KGBVలో చెన్నూర్ రూరల్ CI కృష్ణ, SI నాగరాజు, సోషలిస్ట్ నరేశ్ విద్యార్థినులకు శనివారం అవగాహన కల్పించారు. ఉన్నత లక్ష్యాలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో చదువులో రాణించాలని సూచించారు. మూఢనమ్మకాలు, అశాస్త్రీయ ఆచారాలపై అవగాహన కల్పిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో SO మయూరి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి


