హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సరఫరా బంద్!

MDK: మనోహరాబాద్ మండలం కొండాపూర్ రహదారిలో 11 కేవీ విద్యుత్ లైన్ల మార్పిడి పనుల కారణంగా రేపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3వరకు సేఫ్ కూల్ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కాళ్లకల్ ఏఈ రాజ్ కుమార్ తెలిపారు. మరమ్మతు పనుల నేపథ్యంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.