హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెకుముకి టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ

JN: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బచ్చన్నపేట మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ విభాగంలో పోచన్నపేట జడ్పీహెచ్ఎస్, రెసిడెన్షియల్ విభాగంలో TGMS బచ్చన్నపేట, ప్రైవేట్ విభాగంలో వాణి హైస్కూల్ ప్రథమ స్థానాలు సాధించాయి. కార్యక్రమానికి ఎస్సై శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు అందించారు.