హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

MLG: ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌ను శనివారం ములుగు ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల నిర్వహణను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, చట్టపరిధిలో సత్వర న్యాయం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.