AKP: మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో 8 మండలాలు, 214 పంచాయతీల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. 96 అత్యంత సమస్యాత్మక, 82 సమస్యాత్మక కేంద్రాలపై నిఘా పెట్టామన్నారు. అలాగే, నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల నిబంధన, గుంపులు, ఊరేగింపులపై నిషేధం అమల్లో ఉంటుందన్నారు. దీనిని గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత


