సిరిసిల్ల: గంభీరావుపేట మండలం దోసెలగూడెంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కడారి సురేశ్ తన వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
విషాదం.. పొలంలో మృతి చెందిన రైతు


