హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లికార్జునున్ని దర్శించుకున్న సత్యవతి రాథోడ్

MHBD: మాజీ మంత్రి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సత్యవతి రాథోడ్ శనివారం మరిపెడలో పర్యటించారు. పట్టణంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. ఆమె వెంట మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ బిందు ఆంగోత్, బోడ శ్రీను నాయక్, కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి తదితర నేతలు ఉన్నారు.