అన్నమయ్య: మదనపల్లె మండలం రామాచార్లపల్లి సర్పంచ్ స్థానాన్ని కూటమి తరఫున జనసేన పార్టీకి కేటాయించినట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడించారు. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సీతక యుగంధర్‌ను ఖరారు చేసినట్లు తెలిపారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కేటాయింపు జరిగిందని స్పష్టం చేశారు. కూటమి నిర్ణయానికి అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జనసేనకు సర్పంచ్ స్థానం కేటాయింపు


