RR: షాద్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జి రవి మాట్లాడుతూ.. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ విక్రయాలు ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సివిల్ జడ్జి


