హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చాకిరాల సర్పంచ్‌ ఏకగ్రీవ ఎన్నిక

ప్రకాశం: కనిగిరి మండలంలోని చాకిరాల గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కుందురు శారద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి నుంచి ఎన్నికైనట్లు అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని సర్పంచ్ కుందురు శారద అందుకున్నారు. గ్రామంలో ఏకగ్రీవ ఎన్నికతో టీడీపీ నాయకులు, వారి అనుచరులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.