RR: సిద్దాపూర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు సంబంధించిన జీవో 641ను రద్దు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. దీక్షా శిబిరంలో సమావేశమైన నాయకులు.. ప్రజలకు నష్టం కలిగించే డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని జేఏసీ ఛైర్మన్ రాంబాల్ కోరారు. ప్రభుత్వ భూముల్లో కాలుష్య పరిశ్రమలకు బదులుగా కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
కాలుష్య పరిశ్రమలు వద్దు.. జేఏసీ డిమాండ్


