VZM: కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా శనివారం రామతీర్థం శ్రీరామచంద్రస్వామి దేవస్థానంలో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. చాతుర్మాస దీక్ష ముగించుకున్న స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా భాస్కర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కనులపండువగా స్వామివారి తెప్పోత్సవం


