హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా అభివృద్ధికి ప్రణాళికను రూపొందించాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రణాళికను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2028 నాటికి జిల్లాలో తలసరి ఆదాయం రూ.5 లక్షలు, 2033 నాటికి రూ.10 లక్షలకు పెంచేలా శాఖల వారీగా లక్ష్యాలు సిద్ధం చేయాలని సూచించారు.