హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వయోవృద్ధులకు ప్రత్యేక వైద్య శిబిరం

ATP: అనంతపురం అరవింద్ నగర్‌లోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో శనివారం వయోవృద్ధులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. కంటి, చెవి, సాధారణ వైద్య పరీక్షలు చేపట్టి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. కంటి చూపు, వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.